కల్కి2.. రెండు మూడు సినిమాలకు సమానం: నాగి
ఈ మధ్య ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం ట్రెండ్ అయిపోయింది. గతేడాది కాలంలో వచ్చిన భారీ సినిమాలైన సలార్(Salaar), కల్కి(Kalki), దేవర(Devara) లాంటి సినిమాలన్నింటికీ రెండో భాగం ఉంది. వీటిలో భారీ అంచనాలున్న సినిమా కల్కి2(Kalki2). జులైలో రిలీజైన కల్కి బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కల్కి సూపర్ హిట్ అవడంతో కల్కి2పై భారీ అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ భారీగా ఉండనుందని, కల్కి2లో ప్రభాస్(Prabhas) పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని, కథ మొత్తం ప్రభాస్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కల్కి2 గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) మాట్లాడాడు.
అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Amaran Pre Release Event) కు చీఫ్ గెస్టుగా హాజరైన నాగిని యాంకర్ సుమ(Anchor Suma) కల్కి2కు సంబంధించిన అప్డేట్ను అడిగింది. దానికి నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ కల్కి2 అనే ఒక్క సినిమా రెండు మూడు సినిమాలకు సమానమని చెప్పాడు. అయితే కల్కి2 రావడానికి చాలానే టైమ్ పడుతుందని, తన తర్వాతి సినిమా కల్కి2నే అని నాగి తెలిపాడు.













