Nadiya: ఈ తరం హీరోయిన్లకు నదియా సూచనలు
గత కొన్నేళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను దగ్గర నుంచి దగ్గరగా చూశానంటోంది సీనియర్ నటి నదియా(Nadiya). అత్తారింటికి దారేది(Atharintiki Daredi), అఆ(AAa) లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నదియా రీసెంట్ గా మాట్లాడింది.
ఇప్పుడు హీరోయిన్లకు కారావాన్లతో పాటూ అన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పటికీ వారి ఇబ్బందులు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయని నదియా తెలిపింది. ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒకప్పటిలా లేరని, ఆర్టిస్టులేం చేసినా ప్రతీ కదలికనూ అందరూ పసిగడుతున్నారని ప్రతీ ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను ఆర్టిస్టులపై రుద్దుతూ ట్రోల్ కూడా చేస్తున్నారని ఆమె తెలిపింది.
ఆర్టిస్టులకు సోషల్ మీడియా వల్ల వచ్చే ఇబ్బందుల్ని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు. డిజిటల్ యుగంలో సెలబ్రిటీలకు పర్సనల్ స్పేస్ పూర్తిగా తగ్గిపోయిందని, మారుతున్న జెనరేషన్ లో మనం సర్దుకుపోవాలని, ఎవరికి నచ్చినట్టు వారు తమ లైఫ్ ను కొనసాగించాలని, సోషల్ మీడియా రూల్స్ కు వ్యతిరేకంగా తమకంటూ పర్సనల్ స్పేస్‌ను క్రియేట్ చేసుకోవాలని నదియా ఈ జెనరేషన్ హీరోయిన్ లకు సూచించింది.













