పెద్ద ప్రాజెక్ట్ లో నభా ఛాన్స్ కొట్టినట్లేనా…?
ఫిల్మ్ నగర్ లో ఇప్పుడొక న్యూస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే ఎన్టీఆర్ సినిమాలో నభా నటేష్ ఛాన్స్ కొట్టేసిందని. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్న కొరటాల ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లుండగా ఒక హీరోయిన్ గా నభా కు అవకాశం వరించిందంటున్నారు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రానున్న చిత్రం టోటల్ కొరటాల మార్క్ మూవీ. ఎమోషన్స్, యాక్షన్, మెసేజ్ అన్నీ కలిసి ఉంటాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కియారానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుందని, ఇప్పటికే ఆమెను సంప్రదించారని, ఆమె నో చెప్పే అవకాశాలు లేవనే అనుకుంటున్నారు.
ఏదైనా కారణాల వల్ల కియారా ఈ ప్రాజెక్ట్ లోకి రాకపోతే, ఆ ప్లేస్ లో రష్మిక ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ ఇద్దరిలో మొదటి హీరోయిన్ ఎవరైనా సరే సెకండ్ హీరోయిన్ మాత్రం నభా నే అని ఫిక్స్ చేస్తున్నారు. రీసెంట్ గా తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్స్ లో నభా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. అంతేకాదు నభా అందం, ఎనర్జీ కూడా చాలా బావుండటంతో ఈ భామకు అప్పుడే ఫ్యాన్స్ కూడా బాగా ఎక్కువైపోయారు. అందుకే ఈ పిల్లను తీసుకుంటే కాస్త మాస్ కు కూడా ట్రీట్ ఇచ్చినట్లవుతుందని కొరటాల ఫీల్ అవుతున్నాడని చెప్తున్నారు. మరి ఇందులో ఏ మేర నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













