మరోసారి మాస్ ఛాన్స్ కొట్టేసిన నభా..
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుని కుర్రకారు గుండెల్ని దోచేసుకుంది. ఈ అమ్మాయిని చూసిన కుర్రాళ్లు అన్నీ సినిమాలను ఆమే చేయాలనుకునేలా ఉంటుంది నభా అందం, శౌష్ఠవం. బ్యాచిలర్స్ లో ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఆమెకు అవకాశాలు వరుసగా వస్తున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ లో ఛాందినిగా అందరి మనసుల్ని తాకిన ఈమె.. ఆ సినిమా లో పొట్టి పొట్టి డ్రెస్సులేసుకుని బీచ్ లో పరిగెత్తి అందరి మైండ్ లు పోగొట్టింది. పువ్వు లాంటి ఈ భామ సొగసులను వెండితెరపై చూసి పడిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. తను తిరిగి, పొర్లిన ఇసుకను కేజీల లెక్కన కొనుక్కుని రావడానికి వెళ్లిన వాళ్లూ ఉన్నారు. అలాంటి హీరోయిన్ మరోసారి రవితేజ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్ లో ఎక్కువ వినిపిస్తుంది.
అయితే ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడీ చేస్తున్న రవితేజ ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒకటి త్రినాథ రావు నక్కిన, రెండోది మారుతి, మూడో సినిమాకు కొత్త డైరక్టర్ దర్శకత్వంలో రానున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఒక సినిమాలో హీరోయిన్ గా నభా పేరు వినిపిస్తుంది. ఇప్పటికే రవితేజతో డిస్కోరాజాలో జంట కట్టిన నభా, మరోసారి మాస్ మహారాజా పక్కన ఛాన్స్ కొట్టేయడమంటే లక్ అనే చెప్పాలి.













