ఇస్మార్ట్ హీరోయిన్ కు బంపరాఫర్
నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నభా నటేష్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తర్వాత రామ్ పోతినేని సరసన ఇస్మార్ట్ శంకర్ లో నటించి మరో హిట్ ను అకౌంట్ లో వేసుకుంది. ఆ పిమ్మట రవితేజకు జోడీగా డిస్కో రాజా సినిమా చేసింది కానీ అది డిజాస్టర్ అయింది.
డిస్కోరాజా తర్వాత సోలో బ్రతుకే సో బెటరు సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ కూడా ఫ్లాప్ అయింది. ఇక నభా నుంచి చివరగా వచ్చిన సినిమా మ్యాస్ట్రో. నితిన్ సరసన నటించిన ఆ సినిమా అమ్మడికి డిజాస్టర్ ను మిగిల్చింది. ఆ సినిమా తర్వాత నభా రోడ్ యాక్సిడెంట్ కు గురవడంతో కెమెరా ముందుకు రాలేదు.
యాక్సిడెంట్ నుంచి కోలుకున్న నభా మళ్లా సంవత్సరం నుంచి ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఇన్ స్టాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. మధ్యలో కొన్ని సినిమాలు చేతి వరకు వచ్చి ఆగిపోయాయట. ఇప్పుడు నభాకు అనుకోకుండా ఓ పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ వచ్చింది. హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభు అనే పీరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ లో నభా సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం నభా యుద్ధ నైపుణ్యాలపై ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ బాగుండి ఈ సినిమా హిట్ అయితే నభాకు మళ్లీ ఛాన్సులు పెరిగి బిజీ అయ్యే అవకాశాలున్నాయి.













