అజిత్ తో మైత్రీ మూవీ
టాలీవుడ్ నిర్మాతలు వేరే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అవడం చాలా అరుదు. అందులోనూ అక్కడి స్టార్ హీరోల డేట్స్ సంపాదించడం ఇంకా కష్టం. కానీ ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు వేసిన మొదటి స్టెప్పే తనకు హిట్ ను అందించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఆయన చేసిన వరిసు(వారసుడు) సినిమా కమర్షియల్ గా టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.
సినిమాలో కంటెంట్ పక్కన పెడితే మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. ఇప్పుడు దిల్ రాజు లానే తమ మార్కెట్ ను పక్క భాషల్లో కూడా విస్తరించాలనే ఉద్దేశంతో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ హీరో అజిత్ తో ఓ ప్రాజెక్ట్ ను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నాడట.
విశాల్‌తో రీసెంట్ గా మార్క్ ఆంటోనీ సినిమా చేసిన ఆధిక్, అజిత్‌కు వీరాభిమాని. ఎప్పటినుంచో అజిత్ తో సినిమా చేయాలని చూస్తున్న ఆధిక్కు ఇప్పుడా అవకాశం దక్కింది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ కాంబినేషన్లో సినిమా అయితే ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అజిత్ చేసేది తక్కువ సినిమాలే అయినా మార్కెట్ మాత్రం బాగుంది. ఒకవేళ అన్నీ బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మైత్రీ పంట పండినట్లే.













