చిన్న సినిమాలను హోల్డ్ లో పెట్టిన మైత్రీ
టాలీవుడ్లో అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) ఇప్పుడు తమ వ్యూహంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభాస్(prabhas), అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) వంటి స్టార్ హీరోలతో భారీ సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ, వరుసగా కొన్ని సినిమాలు నిరాశపరిచినా తమ ఫ్యూచర్ ప్లానింగ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తెలుగు సినిమాలతో పాటు రజనీకాంత్(Rajinikanth), సల్మాన్ ఖాన్(Salman Khan) వంటి ఇతర భాషల సూపర్స్టార్లతో కూడా భారీ ప్రాజెక్టులకు మైత్రీ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో వచ్చిన తగ్గుదల కారణంగా మైత్రీ మూవీ మేకర్స్ మిడ్‌రేంజ్ హీరోల సినిమాల విషయంలో జాగ్రత్త వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్, శర్వానంద్(Sharwanand), నితిన్(Nithin) వంటి హీరోలతో ఇప్పటికే డిస్కషన్స్ జరిగిన ప్రాజెక్టులను సంస్థ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. శర్వానంద్- శ్రీను వైట్ల(Srinu Vaitla) కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా ఇప్పుడు అనిల్ సుంకర నిర్మాణంలోకి వెళ్లగా, వరుణ్ తేజ్(Varun Tej) కోసం విక్రమ్ సిరికొండ(Vikram Sirikonda) రెడీ చేసిన ఏఐ లవ్ స్టోరీ కూడా హోల్డ్‌లో పడినట్లు సమాచారం. ఇక నితిన్ వినిపించిన కొన్ని కథలపై కూడా మైత్రీ ప్రస్తుతం ముందుకు వెళ్లే ఆలోచనలో లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ దృష్టి మొత్తం భారీ బడ్జెట్ ప్రాజెక్టులపైనే ఉందని తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ(Fauzi), ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్(Prasanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon), అల్లు అర్జున్(Allu Arjun)- లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ప్రాజెక్టులపై సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. వీటితో పాటు మహేష్ బాబు(mahesh Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లతో కూడా ఫ్యూచర్ లో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రిస్క్ తక్కువగా ఉండే స్టార్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వడం మైత్రీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు.







