Akhanda2: అఖండ2పై తమన్ హైప్ ఎక్కించేస్తున్నాడు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) నుంచి వస్తున్న సినిమా అఖండ2 తాండవం(akhanda2 thandavam). బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా బోయపాటి ఈ మూవీని తెరకెక్కించాడు. ఆల్రెడీ ఈ సినిమా గురించి ఎన్నో గొప్ప వార్తలు వినిపించగా, అఖండ2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసిన అఖండ2 టీమ్, ఆ సాంగ్స్ తో విపరీతమైన బజ్ ను సొంతం చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా అఖండ2 ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేయగా, తాజాగా తమన్(thaman) దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో తమన్ ఇప్పుడే అఖండ2 ట్రైలర్(akhanda2 trailer) కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తైందని, ట్రైలర్ బ్లాస్టో బ్లాస్ట్, ఓం నమఃశివాయ, ఇది పూర్తిగా బాలయ్య గారి మాస్ అంటూ పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అఖండ సినిమాకు తన బీజీఎంతో స్పీకర్లు పగలకొట్టిన తమన్, ఇప్పుడు అఖండ2 ఎలాంటి మ్యూజిక్ ను ఇస్తారో అని ట్రైలర్ పై అంచనాలు ఇంకా భారీగా పెరిగాయి.
https://x.com/musicthaman/status/1991572870015909983?s=48






