Summer Releases: మే 1న గట్టి పోటీ
ప్రతీ వారం లానే మే 1న కూడా బాక్సాఫీస్ వద్ద పలు ఇండస్ట్రీల నుంచి పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సారి ఎప్పటిలా కాకుండా పోటీ కాస్త గట్టిగా ఉండబోతుంది. దీంతో మే 1న ఏయే భాషల నుంచి ఏయే సినిమాలు రానున్నాయా? వాటిలో ఏ సినిమాలకు ఆడియన్స్ పట్టం కడతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాటిలో ముందు టాలీవుడ్ నుంచి నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కిన హిట్3(Hit3) సినిమా వస్తోంది. ఈ సినిమాపై ఆల్రెడీ అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్(Ajay Devagan) హీరోగా నటించిన రైడ్2(Raid2) తో పాటూ మౌనీ రాయ్(Mouni Roy) లీడ్ రోల్ లో నటించిన ది భూత్నీ(the Bhuthni) సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది.
కోలీవుడ్ నుంచి సూర్య(Suriya) హీరోగా నటించిన రెట్రో(retro) సినిమా మే 1న రిలీజ్ కానుండగా, మరో తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family)కూడా మే 1నే రిలీజ్ అవుతుంది. మలయాళం నుంచి ఆసిఫ్ అలీ(Aasif Ali) హీరోగా నటించిన అభ్యంతరకుట్టావలి(AbhyantharaKuttavali) సినిమా రిలీజవుతోంది. వీటితో పాటూ హాలీవుడ్ నుంచి సూపర్ హీరో మూవీగా థండర్‌బోల్ట్స్(Thunderboults) కూడా మే 1న రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. మరి వీటన్నింటిలో ఆడియన్స్ ఏ సినిమాకు బ్రహ్మరథం పడతారో చూడాలి.






