ఏజెంట్ ఎప్పుడొస్తాడు?
ఎంత పెద్ద హిట్ సినిమా రిలీజైనా, ఎంత డిజాస్టర్ అయిన సినిమా అయినా సరే కొన్నాళ్లకు ఓటీటీలోకి రావాల్సిందే. కాకపోతే ముందు వెనుకా అంతే తేడా. ఒకప్పుడు శాటిలైట్ ఛానల్సే కాబట్టి రెండు మూడు నెలలు లేటయినా ఏముండేది కాదు కానీ ఇప్పుడలా కాదు. ఓటీటీ యుగంలో బతుకుతున్నాం. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన సినిమాలు వీలైనంత త్వరగా డిజిటల్ రిలీజ్ వస్తే అంత ఎక్కువ మంది సినిమాను ఓటీటీలో చూస్తారు.
దసరా, బలగం, విరూపాక్ష లాంటి మంచి హిట్ సినిమాలే నెల రోజుల్లో ఓటీటీల్లోకి వస్తే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
ఈ సినిమా ఎడిట్ చేసిన కొత్త వెర్షన్ తో 23వ తేదీన ఓటీటీ రిలీజ్ ఉంటుందని కొన్నాళ్ల కిందటే ప్రచారం జరిగింది కానీ అది చెప్పిన టైమ్ కు రాకుండా మళ్లీ వాయిదా పడింది.
ఏజెంట్ లో ఏదైనా కొత్త సీన్స్ యాడ్ చేసి ఉంటే ఓటీటీలో అయినా సినిమా హిట్ అవుతుందేమోననే పిచ్చి నమ్మకం అక్కినేని ఫ్యాన్స్ది. కానీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ భోళా శంకర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఏజెంట్ డిజిటల్ రిలీజ్ గురించి పట్టించుకునే తీరిక వాళ్లకు ఉంటుందనుకోవడం అభిమానుల పిచ్చి అనుకోవాలి. మరి ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడుంటుందనే విషయం ఓటీటీ సంస్థ అయినా చెప్పాల్సి ఉంది.













