వార్2లో మరెన్నో ఆకర్షణలు
ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో రూపొందుతున్న వార్2(War2) సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండా జరుగుతుంది. దేవర(Devara) ప్రమోషన్స్ కోసం నెల రోజుల పాటూ బ్రేక్ తీసుకున్న తారక్(Tarak) తిరిగి దసరా తర్వాత వార్2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈలోపు హృతిక్, కియారా(Kiara)పై సీన్స్ తో పాటూ ఓ పాటను షూట్ చేశాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayaan Mukharji).
ఇదిలా ఉంటే వార్2 సినిమాలో ఎన్టీఆర్ కాకుండా స్టార్ ఎట్రాక్షన్ ఇంకా ఉండనున్నట్లు తెలుస్తోంది. వార్2 నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) ఈ సినిమాకు మరిన్ని ఎట్రాక్షన్స్ యాడ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తో క్లైమాక్స్ ఎంట్రీ ఇప్పించనున్నట్లు ముంబై మీడియా వర్గాలంటున్నాయి.
హృతిక్, ఎన్టీఆర్ తో పాటూ సల్మాన్ పాల్గొనే ఈ ఎపిసోడ్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు. అంతేకాదు కన్నడ హీరో ధృవ సర్జ(Dhruva Sarja) కూడా వార్2 లో భాగమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ధృవ ఇటీవలే ఈ విషయంలో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలోగా పూర్తి చేసి ఆ తర్వాత టైమ్ ను వీఎఫ్ఎక్స్ కోసం కేటాయించాలని టీమ్ చూస్తుందట. దీపావళికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశముంది.













