భారీ మల్టీస్టారర్ లో మోహన్ లాల్ ?
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. కాగా తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను సంప్రదించినట్లు తెలిసింది. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారట. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన క్రేజీ బ్యూటీ అలియా భట్, అలాగే ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇరత కీలక పాత్రల కోసం విదేశీ నటులు రే స్టీవెన్సన్, అలిసన్ డూడీని తీసుకున్నారు. మరో ప్రత్యేక పాత్రలో అజేయ్ దేవగణ్ నటిస్తున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరెక్కించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.













