Mohan Lal: మల్లూవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) గత నాలుగున్నర దశాబ్ధాలుగా ఏళ్లుగా మల్లూవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ ట్యాగ్ ను నిలబెట్టుకుని కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు మోహన్ లాల్. ఆయన టాలెంట్ చూసి పక్క ఇండస్ట్రీల నుంచి అవకాశాలు ఎన్నో వచ్చాయి.
కానీ ఆయన మాత్రం మలయాళ ఇండస్ట్రీనే నమ్ముకుని అక్కడే సినిమాలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మోహన్ లాల్ తనకు అంత గుర్తింపు రావడానికి కారణం మలయాళ ఇండస్ట్రీనే అని ఒప్పుకున్నారు. ఇవాళ తనకు వచ్చిన ఫేమ్ అంతా మలయాళ సినిమా వల్లేనని, మలయాళ ప్రేక్షకుల కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారని ఆయన అన్నారు.
మలయాళ ఆడియన్స్ ను చూసే తాను వేరే భాషల్లో అవకాశాలు వెతుక్కోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపిన ఆయన మల్లూవుడ్(Malluwood) సాంకేతికంగా కూడా ఎంతో డెవలప్ అయిందని, అందుకే మలయాళం నుంచి గొప్ప సినిమాలు వస్తుంటాయని, తాను అంత గొప్ప పరిశ్రమలో ఉన్నప్పుడు వేరే ఇండస్ట్రీకి వెళ్లాల్సిన పనేముందని ఆయన అన్నారు.













