బీజేపీలోకి మోహన్‌బాబు?
సినీ నటుడు మోహన్‌బాబు త్వరలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమచారం. ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్‌బాబు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో ఆయనతో పాటు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నట్లు తెలిసింది. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోదీతో మోహన్‌బాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని మోహన్‌బాబును మోదీ ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకు ఆయన కూడా సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీలో నెంబర్ 2 నేతగా కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా మోహన్‌బాబు కలవనున్నట్లు తెలిసింది.













