The Paradise: నానికి విలన్ గా మోహన్ బాబు.. క్లారిటీ ఇచ్చిన కన్నప్ప డైరెక్టర్
వరుస హిట్లతో అటు హీరోగా, ఇటు నిర్మాతగా ఫుల్ జోష్ లో ఉన్న నాని(Nani), ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో దసరా(Dasara) సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన కారణంతో ది ప్యారడైజ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే శ్రీకాంత్ ది ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నారు.
అందులో భాగంగానే మొన్నామధ్య ఈ సినిమా నుంచి రా స్టేట్మెంట్(Raw statement) అనే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, దానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు(Mohanbabu) నటిస్తున్నారని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం మోహన్ బాబు క్యారెక్టర్ పై ఎలాంటి న్యూస్ అప్డేట్ రాలేదు.
ఈ నేపథ్యంలో కన్నప్ప(Kannappa) సినిమా డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్(Mukesh kumar singh), ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు పాత్ర గురించి రివీల్ చేశారు. ది ప్యారడైజ్ లో మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ రోల్ చేయనున్నారని, ఆ సినిమా షూటింగ్ లో మోహన్ బాబును చూశానని, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆయన అందర్నీ ఆశ్చర్యపరిచారని తెలిపారు. మొత్తానికి ది ప్యారడైజ్ లో మోహన్ బాబు పాత్ర గురించి ఇప్పటికి క్లారిటీ అయితే వచ్చింది. సోనాలీ కులకర్ణి(sonali kulakarni) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్(Anirudh) సంగీతం అందించనుండగా, వచ్చే ఏడాది మార్చి 26న ది ప్యారడైజ్ రిలీజ్ కానుంది.






