మెగాస్టార్ ఫ్యామిలీలో హాల్ వీన్ సందడి
మెగాస్టార్ కుటుంబ సభ్యులు హాలోవీన్ వేడుకగా జరుపుకున్నారు. విచిత్ర వేషధారణలో సందడి చేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, ఉపాసన, వరుణ్‌తేజ్, నిహారిక, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌దేవ్ తదితరులు భయంకరమైన గెటప్‌లలో కనిపించారు. ముఖానికి రంగు వేసుకుని, విచిత్రమైన దుస్తుల్లో పొజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తన అత్త సురేఖను భయపెడుతున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఎంతో మంచి అత్తమ్మ, భయంకరమైన కోడలు. హాలోవీన్ పార్టీ అని దీనికి క్యాప్షన్ రాశారు. హాలోవీన్ వేడుకలు అక్టోబరు 31వ తేదీతో ముగియనున్నాయి.













