కాకాలో తన పవర్ఫుల్ పేరును లీక్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తన సినిమాల గురించి మాట్లాడే సందర్భాల్లో ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్లు ఇవ్వడం కొత్తేమీ కాదు. తాజాగా కాకా(kaaka) సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు కదిరి కాళిదాస్(kadiri kalidas) అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది. చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించిన తీరు కూడా ప్రత్యేకంగా నిలవడంతో, సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే డిస్కషన్ మొదలైంది.
ఇప్పటికే చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇందులో ఆయన కనిపించిన లుక్, మాస్ ట్రీట్మెంట్తో పాటు మేకర్స్ అనౌన్స్ చేసిన బ్లడీ బెంచ్మార్క్ హామీ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి యువకుడిగా కనిపించిన తీరు, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాను సంక్రాంతి బరిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మార్చాయి.
వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి(bobby kolli) మరోసారి చిరంజీవితో కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్(anaswara rajan) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్(S. thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 13న థియేటర్లలోకి రానుంది. కదిరి కాళిదాస్ క్యారెక్టర్ కు ఉన్న నేపథ్యం, సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ తీరుతెన్నులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








