బాలయ్య స్వర్ణోత్సవానికి మెగా- అల్లు హీరోలు
మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య నెట్టింట ఏ రేంజ్ లో రచ్చ జరుగుతుందో తెలిసిందే. ఇరు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య వార్ చాలా వేడిగా జరుగుతుంది. వాస్తవానికి ఆ రెండు ఫ్యామిలీల మధ్య వైరం ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం చాలా పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. సరిగా ఇదే టైమ్ లో నందమూరి బాలకృష్ణ పేరిట తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు.
బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలందరికీ ఇన్విటేషన్స్ వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఇటు మెగా ఫ్యామిలీలో చిరంజీవికి, అటు అల్లు ఫ్యామిలీలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ కు ఆహ్వానాలు వెళ్లాయి.
ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా హాజరయ్యే ఛాన్సుంది. అల్లు ఫ్యామిలీ నుంచి అరవింద్, బన్నీ కూడా ఈ ఈవెంట్ కు వెళ్లే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ వార్ మొదలయ్యాక జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్ కు ఆయా హీరోలు హాజరు కానుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేదికపై ఇరు ఫ్యామిలీల హీరోల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది.













