సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ !!!
అమ్మాయి బాగుంది అనే మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన మీరాజాస్మిన్, తరువాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, శ్రీకాంత్, రాజశేఖర్, రవితేజ, గోపీచంద్, విశాల్ లాంటి అగ్ర హీరోలతో జతకట్టింది. తన అందంతో, నటనతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఈ భామ చాలా కాలంగా సినిమాల్లో కనిపించింది లేదు.
చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ రీసెంట్గా విమానం అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ‘ మీరా జాస్మిన్’ . కానీ ఈ మూవీలో ఆమె రోల్ ఒక చిన్న పాత్ర మాత్రమే. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో తనకు మళ్ళీ తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఏ అక్క పాత్రనో లేక ఫ్రెండ్స్ పాత్రనో, ఇవేమి కాకపోతే లాయారో, పోలీసో ఇలా ఉంటాయి.
కానీ ఈమెకు మాత్రం అలా చిన్న చిన్న రోల్స్ కాకుండా ఫుల్ లెన్త్ రోల్ ఛాన్స్ వచ్చింది. యువ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఈ మూవీలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది, మరో ముఖ్య పాత్రలో మీరా జాస్మిన్ ని సెలెక్ట్ చేసారని సమాచారం.ఈ మూవీకి ‘స్వాగ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్ అవకాశాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఈ హీరోయిన్ తన మొదటి ఇన్నింగ్స్ లో కొంచెం బొద్దుగా ఉన్నా అందంగా ఉండేది, కానీ ఆమె ఇప్పుడు తన వయస్సు 40 సంవత్సరాలు దాటినా సన్నగా , నాజూకుగా తీగలా మారింది. దీంతో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కూడా తన పోస్టులతో ‘మీరా జాస్మిన్ ‘ ప్రేక్షకులకి అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ముఖ్యంగా తన క్లివేజ్ అందాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.













