మీనాక్షి మామూలు స్పీడు కాదుగా
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కుర్చీ కోసం శ్రీలీల, మీనాక్షి చౌదరి పోటీ పడుతున్నారు. ఈ కుర్చీ కోసం జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే కూడా రేసులోకి వస్తున్నారు. శ్రీలీల ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఛాన్సులు కొట్టేసింది. కాకపోతే అమ్మడు చేసిన సినిమాలేవీ కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. దీంతో శ్రీలీల రేసులో వెనుకబడిపోయింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి, ఆ సినిమాతో మెప్పించలేకపోయినా తర్వాత చేసిన హిట్2 సినిమాతో సక్సెస్ అందుకుని వరుస అవకాశాలందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన గోట్ సినిమా చేస్తన్న మీనాక్షి తెలుగులో దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ చేస్తుంది.
గోట్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుండగా, లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటూ విశ్వక్సేన్ కు జోడీగా నటిస్తున్న మెకానిక్ రాకీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. చిరంజీవి విశ్వంభరలో కూడా మీనాక్షి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో సంక్రాంతికి రాబోతున్న సినిమాలో కూడా మీనాక్షినే హీరోయిన్. వరుణ్ తేజ్ మట్కా కూడా అమ్మడి ఖాతాలోనే ఉంది. నెక్ట్స్ ఇయర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మొత్తంగా చూసుకుంటే మీనాక్షి అకౌంట్ లో ఆరు సినిమాలున్నాయి. అందులో నాలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఈ సినిమాలు హిట్ అయితే మీనాక్షి మార్కెట్, ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం.













