మత్తు వదలరా ఫస్ట్‌లుక్ విడుదల
సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మత్తు వదలరా. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోగా పరిచయం అవుతున్న శ్రీసింహాకు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కాలభైరవ (ఎమ్.ఎమ్.కీరవాణి పెద్ద కుమారుడు)కు, అలాగే చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మత్తు వదలరా చిత్ర ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్‌లో హైలెట్ చేసినవి చూస్తుంటే ఈ చిత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది.













