Ravi Teja: స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ తో మాస్ మహారాజా సినిమా
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) సంవత్సరానికి ఎంత లేదన్నా రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తూ ఉంటారు. గతేడాది కూడా ఆయన్నుంచి ఈగల్(Eagle), మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాలొచ్చినప్పటికీ అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇకపై సినిమాల వేగాన్ని తగ్గించాలని కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు రవితేజ.
ప్రస్తుతం రవితేజ చేతిలో మాస్ జాతర(Mass Jathara) అనే సినిమా ఒక్కటే ఉంది. త్వరలోనే మాస్ జాతర షూటింగ్ కూడా పూర్తి కానుంది. అందుకే ఇప్పుడు రవితేజ తన తర్వాతి సినిమా కోసం రైటర్ కం డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు కిషోర్ తిరుమల(Kishore Tirumala). తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫీల్ గుడ్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమల ఇప్పటివరకు మాస్, కమర్షియల్ సినిమాలు చేసింది లేదు.
అలాంటి కిషోర్ తిరుమల తో రవితేజ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను చేస్తున్నాడని తెలియడంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో అనే అంచనాలు అప్పుడే ఫ్యాన్స్ లో మొదలైపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రవితేజ మాస్ జాతర సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.













