మేజిక్ చేయలేకపోతున్న మణిశర్మ
టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలు, సంగీతానికి మరీ ముఖ్యంగా ఆయన రీరికార్డింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం ఆయన సంగీతం వల్లనే వంద రోజులు ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆడియో కంపెనీలు కోట్లలో లాభం చూసింది కూడా ఆయన సంగీతం వల్లనే. కొన్నేళ్ల కిందటే ఫామ్ కోల్పోయిన మణిశర్మ, ఆ తర్వాత మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్లు దూసుకొస్తుండటం వల్ల బాగా స్లో అయ్యాడు.
కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మణిశర్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు. ఆ సినిమాకు మణి ఇచ్చిన సంగీతం నెక్ట్స్ లెవెల్ లో ఉంది. అందువల్లే ఆ సినిమా తర్వాత ఆయనకు వరుస ఆఫర్లొచ్చాయి. కానీ ఆయనకు వచ్చిన ఏ ఆఫర్నూ ఆయన సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఆచార్య, శాకుంతలం, శ్రీదేవి సోడీ సెంటర్, సీటీమార్, నారప్ప, రెడ్ ఇలా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలకు సైతం మణి ఛార్ట్ బస్టర్ ఆల్బమ్ ఒక్కదానికి కూడా ఇవ్వలేకపోయాడు.
రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్ విషయంలో ట్యూన్స్ రిపీట్ అయ్యాయి తప్పించి మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్స్ మాత్రం లేవు. తనకంటే సీనియర్ అయిన రెహమాన్ ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంటే మణిశర్మ మాత్రం ఇక నా పని అయిపోయిందన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. మళ్లీ మణిశర్మ తన మ్యూజిక్ తో ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.













