Manchu Vishnu: విష్ణు బానే ఆన్సర్ ఇచ్చాడుగా

మంచు ఫ్యామిలీలోని నటులెప్పుడూ ఏదొక విషయంలో విమర్శల పాలవుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా మంచు విష్ణు(Manchu Vishnu)పై సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ వస్తూ ఉంటాయి. విష్ణు యాక్టింగ్ దగ్గర నుంచి తన పర్సనల్ విషయాల వరకూ ప్రతీ దాని గురించి నెటిజన్లు అతన్ని విమర్శిస్తూ ఉంటారు. అయితే విష్ణు ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టాడు.
విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప(Kannappa) సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవరూ ఊహించని విధంగా పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లైమాక్స్ లో విష్ణు నటన నెక్ట్స్ లెవెల్ లో ఉంది. విష్ణు నుంచి ఈ రేంజ్ యాక్టింగ్ ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
ఇన్నాళ్లుగా తనను ట్రోల్ చేస్తున్న వారికి విష్ణు తన యాక్టింగ్ తోనే ఆన్సర్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో సింగిల్ టేక్ డైలాగ్ నుంచి శివుని వద్ద వచ్చే ఎమోషనల్ సీన్ వరకు ప్రతీదీ విష్ణు అదరగొట్టాడు. ఇంకా చెప్పాలంటే కన్నప్ప లో తిన్నడు(Thinnadu) గా విష్ణు తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రభాస్(Prabhas), మోహన్ బాబు(Mohanbabu), అక్షయ్ కుమార్(Akshay kumar), మోహన్ లాల్(Mohanlal), కాజల్(Kajal) నటించిన ఈ సినిమా ఆఖరికి ఏ ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.