Manchu Vishnu: ప్రభుదేవాతో విష్ణు సినిమా

మంచు విష్ణు(manchu vishnu) లీడ్ రోల్ లో నటించిన కన్నప్ప(Kannappa) సినిమా గత వారం రిలీజైంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన కన్నప్ప గత వారం రిలీజై ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ కన్నప్పకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. విష్ణు యాక్టింగ్ పై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలకు కన్నప్ప సినిమాలోని తన యాక్టింగ్ తో అందరికీ సమాధానం చెప్పాడు విష్ణు.
దీంతో కన్నప్ప తర్వాత విష్ణు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు విష్ణు తన నెక్ట్స్ మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తోంది. కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్ గా చేసిన ప్రభుదేవా(Prabhudeva) దర్శకత్వంలో విష్ణు ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. కన్నప్ప సినిమా టైమ్ లో వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని అంటున్నారు.
వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో విష్ణుకు ప్రభుదేవా ఓ కథ చెప్పగా, ఆ కథకు విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కన్నప్ప సినిమాను నిర్మించిన మంచు ఫ్యామిలీ(Manchu family)నే ఈ సినిమాను కూడా నిర్మించనున్నట్టు సమాచారం.