Manchu Vishnu: కన్నప్పకు ప్రీక్వెల్ ఆలోచనలో విష్ణు

విష్ణు(Manchu Vishnu) ఎన్నో ఏళ్లుగా కష్టపడి తెరకెక్కించిన కన్నప్ప(Kannappa) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మీడియా ముందుకొచ్చిన మంచు విష్ణు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కన్నప్ప సినిమా చూసి ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పిన విష్ణు, త్వరలోనే కన్నప్పకు భారీ సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నట్టు తెలిపాడు.
కన్నప్ప సినిమా తర్వాత నెక్ట్స్ ఏంటనే విషయంలో విష్ణు ఓ హింట్ ఇచ్చాడు. కన్నప్ప చూశాక టాలీవుడ్ లోని ప్రెజెంట్ జెనరేషన్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు తనకు ఫోన్ చేసి కన్నప్పకు ప్రీక్వెల్ చేస్తారా అని అడిగారని, అది విని ముందుగా తాను నవ్వుకున్నానని, కానీ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ఉండదు కాబట్టి తీస్తే ప్రీక్వెలే తీయాలని చెప్పడంతో విష్ణు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడేమో అని అందరికీ సందేహంగా ఉంది.
అయితే అదే సక్సెస్ మీట్ లో కన్నప్ప ను బాలీవుడ్ డైరెక్టర్ తో ఎందుకు తీయాల్సి వచ్చిందోననే విషయంలో కూడా విష్ణు క్లారిటీ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా తన సినిమాలు ఎలా ఆడుతున్నాయో అందరికీ తెలిసిందేనని, ఫేమ్ లో లేని తాను కన్నప్ప స్క్రిప్ట్ తో వెళ్తే తెలుగులోని ఏ స్టార్ డైరెక్టర్ తనతో సినిమా చేయరని తనకు తెలుసని అందుకే బాలీవుడ్ లో మహా భారతం(maha bharatham) లాంటి గొప్ప సీరియల్ ను తీసిన ముకేష్ కుమార్ సింగ్(mukesh kumar singh) ను ఎంచుకున్నట్టు విష్ణు తెలిపాడు.