Vishnu: రామాయణంపై కన్నేసిన విష్ణు

కన్నప్ప(Kannappa) సినిమా కోసం దేశంలోని స్టార్లందరినీ ఒకచోటుకు చేర్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు మంచు విష్ణు(Manchu Vishnu). కన్నప్పను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పిన విష్ణు ఆ మూవీ కోసం చాలానే కష్టపడ్డాడు. కన్నప్పతో నటుడిగా చాలా ఇంప్రూవ్ అవడంతో పాటూ ఎందరో ప్రశంసలందుకున్న మంచు విష్ణు కన్నప్ప కంటే ముందు రామాయణంను చేయాలని ట్రై చేశాడట.
2009లోనే రామాయణంకు సంబంధించిన స్క్రిప్ట్ తన వద్ద రెడీగా ఉందని, ఆ సినిమాలో రాముడి పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)ను నటించమని అడిగానని, కాకపోతే బడ్జెట్ సమస్యతో ఆ మూవీ వర్కవుట్ కాలేదని విష్ణు చెప్పాడు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందని చెప్పిన విష్ణు, ఫ్యూచర్ లో తాను మళ్లీ ఆ సినిమాను చేస్తానో లేదో కూడా చెప్పలేనన్నాడు.
ఒకవేళ చేస్తే రాముడిగా సూర్య, సీతా దేవిగా ఆలియా భట్(Alia Bhatt)0, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్(Kalyan Ram), హనుమంతుడిగా తాను(Manchu Vishnu), రావణాసురుడిగా తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu), ఇంద్రజిత్ గా కార్తీ(Karthi), జటాయుగా సత్యరాజ్(Satyaraj) ను అనుకున్నట్టు చెప్పాడు. విష్ణు చెప్పిన కాస్టింగ్ విని అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ కన్నప్ప కోసం భారీ తారాగణాన్ని దింపిన విష్ణు తలచుకుంటే రామాయణం కోసం వీరిని లైన్ లో పెట్టడం పెద్ద విశేషమేమీ కాదనిపిస్తోంది.