Manchu Vishnu: కన్నప్ప తర్వాత నా లైఫే మారింది: మంచు విష్ణు
మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప(Kannappa). ముకేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohan Lal), కాజల్(Kajal) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో మంచు విష్ణు ప్రమోషన్స్ ను స్పీడప్ చేశాడు.
అందులో భాగంగానే మంచు విష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కన్నప్ప కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపాడు. కన్నప్ప సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి తన జీవితం చాలా ప్రశాంతంగా ఉందని చెప్తోన్న విష్ణు, అదంతా శివ లీల వల్లే జరిగిందంటున్నాడు. ఈ మూవీ తనను ఎంతగానో మార్చిందని విష్ణు చెప్తున్నాడు.
యాక్టర్ గా తన లైఫ్ కన్నప్పకు ముందు, కన్నప్పకు తర్వాత అన్నట్టు మారిందని చెప్తున్న మంచు విష్ణు, కన్నప్ప సినిమా తనకొక బేబీ లాంటిదని విష్ణు తెలిపాడు. ఈ సినిమా చేస్తున్న టైమ్ లో తానేమీ ఫుడ్ కు సంబంధి రూల్స్ పాటించలేదని, కానీ తిన్నడు కన్నప్పగా మారినప్పటి నుంచి మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు నేల పైనే పడుకున్నట్టు విష్ణు తెలిపాడు.













