కెటీఆర్ పిలుపు మేరకు మనంసైతం సేవా కార్యక్రమాలు
తన పట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మనం సైతం సంస్థ ముందుకొచ్చింది. చిరునవ్వును కానుకగా ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నాన్ని చేపట్టింది. మనం సైతం సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని, రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆపన్నులకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుటు నరేష్, రాజకీయ నేత గట్టు రామచంద్రరావు, చిత్రపురి కాలనీ అసోసియేషన్ నాయకులు వల్లభనేని అనిల్ కుమార్, బందరు బాబీ, వినోద్ బాలా, ఆదాయపన్ను శాఖ అధికారి సాయి ప్రసాద్, టీన్యూస్ పీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, మదన్ మోహన్ రెడ్డి, డాడీ శ్రీనివాస్‌లకు చెక్‌లు అందజేశారు.













