Dude: డ్యూడ్ లో హీరోయిన్ క్యారెక్టర్ పై డైరెక్టర్ క్లారిటీ

లవ్ టుడే(love today), రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the dragon) సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan), రీసెంట్ గా దీపావళికి డ్యూడ్(Dude) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో హిట్ ను అందుకున్నాడు. గత వారం రిలీజైన డ్యూడ్ అప్పుడే రూ.100 కోట్ల మార్క్ ను అందుకుని ప్రదీప్ వరుసగా మూడు సార్లు ఈ రూ.100 కోట్ల మార్క్ ను అందుకున్న హీరోగా మార్చింది.
అయితే డ్యూడ్ మూవీ హిట్టైనప్పటికీ అందులో హీరోయిన్ మమిత బైజు(mamitha byju) చేసిన క్యారెక్టర్ పై ఆడియన్స్ విభేధిస్తున్నారు. ఈ విషయంపై రీసెంట్ గా ఓ సందర్భంలో డైరెక్టర్ కీర్తీశ్వరన్(keertheeswaran) మాట్లాడారు. మమిత చేసిన కుంధన(kundhana) క్యారెక్టర్ ను ఆడియన్స్ విభేదిస్తున్నది నిజమేనని, అయితే తాను ఆమె క్యారెక్టర్ ను ఎందుకు అలా రాసుకున్నాడో వెల్లడించారు.
మమిత క్యారెక్టర్ ను తాను ఓ ఐడియల్ అమ్మాయిగా చూపించాలనుకోలేదని, అలా అని ఆమెను నెగిటివ్ యాంగిల్ లో చూపించాలని కూడా అనుకోలేదని, బయట రెగ్యులర్ గా మనం కలుస్తూ, మాట్లాడే అమ్మాయిలు ఎలా ఉంటారో అలానే చూపించాలనుకున్నాని, అలా కాకుండా మరోలా చూపిస్తే ఆ క్యారెక్టర్ రియలిస్టిక్ గా ఉండదని అందుకే మమిత పాత్రను అలా డిజైన్ చేసినట్టు కీర్తీశ్వరన్ చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించిన ఈ సినిమాలో శరత్ కుమార్(sarath kumar) కీలక పాత్రలో నటించగా, సాయి అభ్యంకర్(sai abhyankar) డ్యూడ్ కు సంగీతం అందించారు.