శోభన సంచలన నిర్ణయం
నేను సినిమాలకు దూరంగా ఉన్నాను కానీ సినిమాకు సంబంధించిన ఏ పనికైనా ముందుంటాను అని నటి శోభన అన్నారు. నాగార్జున పరిచయ చిత్రం విక్రమ్ మొదలుకొని, తెలుగు అగ్ర హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు మరో రూపంలో తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నారు. తెలంగాణ ప్రభుత్వ టి.ఫైబర్‌తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో 50 సీట్ల కెపాసిటీగల జాదూజ్ సెంటర్ ఫైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనికి శోభన సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.
శోభన మాట్లాడుతూ తెలుగు గడ్డపై ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ప్రస్తుతం సినిమాలో నటించాలని లేదు. కానీ సినిమాకు సంబంధించిన ఏ పనిలోనైనా చురుగ్గా పాల్గొంటా. జాదూజ్ సెంటర్స్ వేదికగా మన డాన్స్, కల్చర్ అన్నింటిని అభివృద్ధి చేయ్యాలనుకుంటున్నాం. డాన్స్ నేర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. జాదూజ్ సెంటర్స్ ద్వారా వినోదంతోపాటు, గ్రామీణులకు విజ్ఞానాన్ని సైతం అందించనున్నామనీ, తెలంగాణలో గల 8వేల గ్రామల్లో, తొలి విడతగా 500 గ్రామాల్లో జాదూజ్ సెంటర్స్ నెలకొల్పేందుకు రంగం సిద్ధమైందనీ, వీటిలో చాయ్ నాస్తా కేప్‌లు కూడా ఏర్పాటు కానున్నాయని రాహుల్ నెహ్రా చెప్పారు.













