Thandel: తండేల్ ఓపెనింగ్స్ పై మేకర్స్ నమ్మకం
నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కలిసి నటిస్తున్న తండేల్(Thandel) సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. చందూ మొండేటి(Chandoo mondeti) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్2(Geetha arts2) బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు. దానికి పలు కారణాలున్నాయి.
అందులో మొదటి రీజన్ సాయిపల్లవి. మూడేళ్ల తర్వాత సాయి పల్లవి నుంచి వస్తున్న తెలుగు సినిమా కావడంతో తండేల్ పై మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమా నిజ జీవిత కథతో దేశభక్తి మరియు లవ్ స్టోరీతో రూపొందింది. ఈ సినిమా కోసం చైతన్య కష్టం కూడా ఒక రీజన్. తండేల్ కోసం చైతన్య పడిన శ్రమ ప్రతీ ఫ్రేమ్ లో చాలా క్లియర్ గా తెలుస్తోంది.
నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మరో రీజన్ కాగా అన్నింటికంటే మెయిన్ రీజన్ దేవీ శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతం. తండేల్ నుంచి ఇప్పటికి మూడు పాటలు రిలీజ్ కాగా, ఆ మూడు పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బుజ్జి తల్లి సాంగ్ అయితే నెక్ట్స్ లెవెల్ కు రీచ్ అయింది. రీసెంట్ గా వచ్చిన హైలెస్సో సాంగ్(Hilesso Hilessa) కూడా మంచి ఆదరణ అందుకుంది. ఇన్ని అంచనాల నడుమ వస్తున్న తండేల్ కచ్ఛితంగా మంచి ఓపెనింగ్స్ ను సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.













