మహేష్ ఫ్యాన్స్ తగ్గడం లేదుగా?
ఈ మధ్య టాలీవుడ్లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రతి స్టార్ హీరో బర్త్డే నే వేదికకానున్నది. ఇప్పటికే కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. మహేష్ మూవీస్ ఇప్పటికే ఒక్కడు, పోకిరి సినిమాలని రీ రిలీజ్ చేసారు. ఒక్కడు మూవీ 2.54 కోట్లు కలెక్ట్ చేయగా, పోకిరి 1.73 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.
అయితే ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సారి ప్రేక్షకుల ముందుకు బిజినెస్ మేన్ మూవీ రాబోతున్నది. దీనికోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సగటు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ నటిస్తున్న ‘గుంటూరు కారం ‘ నుండి మహేష్ బర్త్ డే కి ఆడియో సింగిల్ కానీ టీజర్ కానీ వచ్చే ప్లాన్స్ కూడా ఏమీ లేనట్లే కనిపిస్తుంది.
పోకిరి తరువాత పూరి జగన్నాధ్ హీరో మహేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా బిజినెస్ మేన్. మహేష్ కెరీర్ లో ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పూరి తన హీరోని మాస్ మాఫియా గా చూపించడం,కాజల్ అగర్వాల్ అందాలు, థమన్ సంగీతం ఇలా అన్ని ఈ మూవీకి ప్లస్ లే. ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఆలస్యం కొన్ని క్షణాల్లో ఫుల్ అయిపోతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ నే ఈ టికెట్స్ కి ఇంత క్రేజ్ తెచ్చిపెట్టారు అని చెప్పాలి. ఇలా ఒక్క హైదరాబాద్ నే కాదు. వైజాగ్, విజయవాడ, కాకినాడ అన్ని చోట్లా ఇదే జరుగుతున్నది.
అలా అని ఈ సినిమా ఓటిటి, యూట్యూబ్ లో లేదా అంటే అలా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఈ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు అంటే? పూరి మార్క్ డైలాగ్స్. అవి ఈ మూవీలో చాలానే ఉన్నాయి. ఏదేమైనా రీ రిలీజ్ కి ఇంత స్థాయి రావడం విశేషమనే చెప్పాలి. దీనిలో భాగంగా చాలా థియేటర్స్ లో స్క్రీన్లు పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు, మహేష్ ఫ్యాన్స్ ఫాలోఅప్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆగస్టు 10 న జైలర్ , 11 న భోళా శంకర్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మహేష్ అభిమానులు మొదటి రోజు రికార్డ్స్ పైన దృష్టి పెట్టారు. దీని కోసం మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ట్విట్టర్లో ఆక్టివ్ గా ఉంటూ బుకింగ్స్ తాలూకు అప్ డేట్స్ ని ఇస్తూ హంగామా చేస్తున్నారు.













