మహేష్ కు చెప్పింది యానిమల్ స్టోరీ కాదు.. డెవిల్ స్టోరీ
ఈ వారం రిలీజ్ కాబోతున్న యానిమల్ సినిమాకు ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్, ముంబై లాంటి సిటీల్లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కు ఫాస్ట్ ఫిల్లింగ్ పడుతుంది. చిత్ర యూనిట్ సినిమాకు తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఆ ప్రెస్మీట్లో మరోసారి మహేష్ బాబుకు సందీప్ కథ చెప్పిన ప్రస్తావన వచ్చింది. మహేష్ ను తానొక స్టోరీ చెప్పానని, అయితే అది యానిమల్ కు మించిన వయెలెంట్ క్యారెక్టరైజేషన్‌తో డెవిల్ లా ఉంటుందని, కానీ మహేష్ కు ఆ కథ అంతగా నచ్చకపోవడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.
ఇది విన్న మహేష్ ఫ్యాన్ బాధ వర్ణనాతీతం. వీరిద్దరి కాంబోలో ఒకవేళ సినిమా వచ్చి ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఏ రేంజ్ లో ఉండేదో ఊహకు కూడా అందదు. అలాంటిది మహేష్, సందీప్ తో ఫిల్మ్ ను ఎందుకు వదులుకున్నాడని మహేష్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో సందీప్ తో మహేష్ సినిమా ఉన్నా కూడా అది కార్యరూపం దాల్చడానికి ఎంత లేదన్నా మరో ఐదేళ్లు పట్టడం ఖాయం.













