న్యూయార్క్‌లో సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎంజాయ్
న్యూయార్క్ సిటీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. గతవారం భార్య నమత్ర, కుమారుడు గౌతమ్, కుమార్తె సీతారతో కలిసి అమెరికా ట్రిప్‌కు వెళ్లారాయన. వారం రోజులుగా న్యూయార్క్ సిటీలో వీరు ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఎప్పుడూ అభిమానులకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే మహేష్ ఒక టూర్ ఆప్డేట్స్, ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో కుటుంబంతో కలిసి దిగిన ఫొటో షేర్ చేశారు. ప్రతిసినిమా తర్వాత ఓ లాంగ్ ట్రిప్‌కు ఫ్యామిలీతో వెళ్లటం మహేష్‌కు అలవాటు అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్‌బస్టర్ రావటంతో మహేష్, ఫ్యామిలీ మరింత ఎంజాయ్ చేస్తున్నారు. సుమారుగా ఈ ట్రిప్ రెండు నెలలు కొనసాగనుంది. ఈ వెకేషన్ పూర్తికాగానే మహేష్ వంశీ పైడిపల్లి చిత్రంలో నటించనున్నారు.













