మరోసారి అన్స్టాపబుల్కు మహేష్..
ఆహా కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్లోకి అడుగుపెట్టిన ఈ షో, మూడో సీజన్లో కూడా రెండు ఎపిసోడ్స్‌ను రిలీజ్ చేసింది. మూడో ఎపిసోడ్‌కు గెస్టులుగా సుహాసిని, శ్రియ, జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది.
అయితే త్వరలో సీజన్3లో ఒక ఎపిసోడ్‌ను మహేష్ బాబుతో ప్లాన్ చేశారట. ఇప్పటికే మహేష్ ఒకసారి ఈ షోకు వచ్చాడు. ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఎండింగ్ ఇవ్వడానికి ఆహా యాజమాన్యం ఆ ఎపిసోడ్‌ను మహేష్ తో ప్లాన్ చేసింది. అనుకున్నట్లే ఆ ఎపిసోడ్ అప్పట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ మరోసారి మహేష్ ఈ షోకు వస్తున్నాడని తెలియడంతో అందరూ ఎంతో ఎగ్జయింట్ గా ఉన్నారు.
త్రివిక్రమ్ తో కలిసి మహేష్ చేస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే మహేష్ ఈసారి అన్స్టాపబుల్కు రానున్నాడు. మహేష్ తో పాటూ త్రివిక్రమ్ కూడా ఈసారి షో లో పాల్గొననున్నాడట. త్వరలోనే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ను ఆహా వారు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఫస్ట్ సీజన్లో మహేష్ ఒక్కడే వచ్చిన ఎపిసోడ్‌కే రికార్డులు సృష్టించినప్పుడు, ఈసారి మహేష్ కు త్రివిక్రమ్ తోడైతే ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కలుగుతోంది.













