హరోంహరను మించేసిన మహరాజా
ఎంతో కాలంగా సుధీర్ బాబు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన తన తాజా సినిమా హరోం హర ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోయినా మాస్ ఆడియన్స్ తో ఓకే అనిపించుకుంది. అయితే ఈ సినిమాకు అనుకోని విధంగా తమిళ డబ్బింగ్ మూవీ మహారాజా షాకిస్తోంది.
రిలీజ్ ముందు రోజు వరకు సేతపతి సినిమా మహారాజా మీద అసలు బజ్ లేదు. కానీ ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేయడంతో సినిమా నచ్చి రిలీజ్ రోజు నుంచి సీన్ మొత్తం మారిపోయింది. హరోంహరను మించి మహారాజా కు వసూళ్లు బాగా వస్తున్నాయి. గత రెండు రోజుల్లో బుక్ మై షో లో తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ సెంటర్లలో మహారాజాకు మంచి షేర్ వస్తోంది. సోమవారం బక్రీద్ సందర్భంగా సెలవు రావడంతో మొత్తం నాలుగు రోజుల్లోనే మహారాజా లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ పండితులంటున్నారు. ఒకవేళ హరోం హర మాత్రమే రిలీజ్ అయుంటే సుధీర్ బాబు డామినేట్ చేసే అవకాశముండేది. అలా అని హరోం హరకు అసలు కలెక్షన్లు లేవని కాదు కానీ అనుకున్న రేంజ్ లో లేవు. వీకెండ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి అర్థమయ్యే అవకాశముంది.













