భారీ మొత్తానికి మహారాజా డిజిటల్ రైట్స్
విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ లో మొదలుకొని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తన 50వ సినిమా మహారాజా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సినిమా కచ్ఛితంగా ఆడియన్స్ ను అలరిస్తుందని, మహారాజాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటం వల్ల మహారాజా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాను కొనాలని ప్రయత్నించగా చివరకు నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ సినిమాను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మహారాజాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఇక్కడ కూడా భారీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించాడు.













