Madhavan: సీనియర్ల నుంచి నేర్చుకుంది అదే
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మాధవన్(Madhavan) గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎలాంటి పాత్రలోనైనా ఆడియన్స్ ను ఆకట్టుకునే నటుల్లో మాధవన్ కూడా ఒకరు. తాజాగా ఆయన నటించిన ఆప్ జైసా కోయి(aap jaisa koyi) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన మాధవన్ పలు విషయాలను వెల్లడించారు.
40 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టర్ గా ఉన్న తనకు అవార్డులతో పని లేదని, తనకంటే ఎంతోమంది గొప్ప యాక్టర్లు ఉన్నారని, వారికే తగిన గుర్తింపు లభించలేదని, మాధవన్ ఫలానా అవార్డుకు అర్హుడు అని ఆడియన్స్ అనుకోవడమే తనకు అవార్డు కంటే ఎక్కువని అంటున్నారు. ఎన్నో గొప్ప సినిమాలను ఇండస్ట్రీకి అందించిన దిలీప్ కుమార్(dileep kumar)కే నేషనల్ అవార్డు దక్కలేదని అన్నారు.
అవార్డుల కంటే ఆడియన్స్ ను అలరించడమే తనకు ముఖ్యమని, ఇప్పటికీ తనకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయంటే దానికి కారణం తాను చేసే పాత్రపై తాను నిజాయితీగా ఉండటమేనని, ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి తనకు ఎలాంటి బాధ లేదని, సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) నుంచే తాను ఈ విషయాన్ని నేర్చుకున్నానని, ఆయన ఆఫ్ స్క్రీన్ లో ఎలా కనిపించినా స్క్రీన్ పై మాత్రం మ్యాజిక్ చేస్తారని, తన ఫ్రెండ్ అజిత్ కుమార్(ajith kumar) కూడా అంతేనని తన సీనియర్ల నుంచి తాను నేర్చుకున్న విషయం అదేనని మాధవన్ చెప్పారు.







