Madhavan: కొడుకుని చూస్తే గర్వంగా ఉంది: మాధవన్
ప్రముఖ నటుడు మాధవన్(Madhavan) అందం గురించి, నటన గురించి, ఆయన టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తండ్రిలాగే తన కొడుకు వేదాంత్(Vedanth) కూడా కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. కాకపోతే సినీరంగంలో కాదు స్పోర్ట్స్ లో. మాధవన్ కొడుకు వేదాంత మాధవన్ నేషనల్ లెవెల్ స్విమ్మర్. ఇప్పటికే ఎన్నో పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలు తెచ్చాడు.
కొడుకు స్థాయి చూసి మాధవన్ ఎంతో మురిసిపోతున్నాడు. తన కొడుకు విషయంలో ఎంతో గర్వంగా ఉన్నట్లు మాధవన్ రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. వేదాంత్ గురించి ఎవరైనా గొప్పగా చెప్తుంటే తనకెంతో ఆనందంగా ఉంటుందని, తన వర్క్ నచ్చిందని చెప్పేదానికంటే వేదాంత్ ప్రతిభను ప్రశంసిస్తే తనకెంతో సంతోషంగా ఉంటుందన మాధవన్ తెలిపాడు.
అలా అని వేదాంత్‌కు సలహాలు ఇవ్వకుండా ఉండడు మాధవన్. నా కొడుకుగా ఉండటం వల్ల సొసైటీలో నీకొక గుర్తింపొచ్చిందని, దాని వల్ల అందరూ నిన్నే గమనిస్తుంటారని, చిన్న తప్పు చేసినా నేషనల్ వైడ్ లో అందరికీ న్యూస్ అయిపోతావు కాబట్టి ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండమని వేదాంత్‌కు ఎప్పటికప్పుడు మాధవన్ హెచ్చరిస్తూనే ఉంటాడట.













