త్వరలో ఏపీలో మా అవార్డులు ప్రదానం
ఆంధ్రప్రదేశ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి సర్వ సభ్యసమావేశం ఇటీవల తెనాలిలో జరిగింది. మా ఎపీ ఫిలిమ్ అవార్డ్స్ పేరుతో ఓ వేడుకను నిర్వహించబోతున్నట్లు మా సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌రాజా, అధ్యక్షురాలు నటి కవిత తెలిపారు. 2018లో ప్రేక్షకులను అలరించి ఉత్తమ చిత్రాలకు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేయనున్నామనీ, ప్రజలే న్యాయమూర్తులుగా తీర్పు ఇస్తారని వారు అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల మొదటివారం నుంచీ ఆగస్టు 15 వరకూ ఎంట్రీలు పంపవచ్చని తెలిపారు. లేడీ డైరెక్టర్ లేద కథానాయికలకు విజయనిర్మల స్మారక అవార్డును ఇవ్వనున్నట్లు కవిత తెలిపారు.













