వెండితెరపై గంగూలీ బయోపిక్
ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరకు రావడం ఖాయమైంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిలిమ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ గొప్ప బాధ్యతలను తీసుకున్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. గొప్ప ఇన్నింగ్స్ ను తెరపై చూపిస్తాం అని లవ్ ఫిలిమ్స్ పోస్ట్ చేసింది. లవ్ ఫిలిమ్స్ నా బయోపిక్‌ను నిర్మిస్తుండటం చాలా ఆసక్తిగా ఉంది అని ఇన్‌స్టా ద్వారా స్పందించారు గంగూలీ. ఈ చిత్రంలో గంగూలీగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెలడయ్యే అవకాశం ఉంది.













