లూసీఫర్ స్టార్ట్ అవకపోవడానికి రీజన్ అదే..
ఒకప్పుడు ఒక సినిమా అయిపోయాక మరో సినిమా అనౌన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ట్రెండ్ మారింది. ఒక సినిమా సెట్స్ మీదుండగానే తమ తర్వాతి సినిమాలను లైన్ లో పెడుతున్నారు హీరోలు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడదే చేస్తున్నారనేది తన స్పీడ్ చూస్తుంటే అర్థమవుతుంది. లాక్ డౌన్ టైమ్ లో ఒకేసారి నాలుగు సినిమాల్ని అనౌన్స్ చేసి యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోనని ప్రూవ్ చేశారు. అంతేకాదు ఆ సినిమాల బౌండ్ స్క్రిప్ట్ కోసం వారితో వర్క్ కూడా చేయించాడు చిరు.
ఆ నాలుగు సినిమాల్లో లూసీఫర్ రీమేక్ కూడా ఒకటి. ఆ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. రారాజు, కింగ్ మేకర్ అనే టైటిల్స్ ను ఈ సినిమాకు టైటిల్ గా అనుకుంటున్నారని కథనాలు కూడా వచ్చాయి. ఒరిజినల్ వెర్షన్ కంటే భిన్నంగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు మోహన్ రాజా. కానీ ఆయన చేసిన మార్పులు మెగా స్టార్ కు నచ్చలేదని అందుకే దానికి కరెక్షన్స్ చేస్తుండటంతో లూసీఫర్ రీమేక్ లేట్ అవుతుంది.
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సినిమా స్టార్ట్ అవాల్సి ఉండగా, స్క్రిప్ట్ పరంగా కొన్ని కరెక్షన్స్ ఉండటం, కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అది లేట్ అవుతూ వస్తుంది. అయినా ఒక దగ్గర హిట్ అయిన సినిమాకు రీమేక్ చేయాలంటే అది కత్తిమీద సాము లాంటిదే. ఒరిజినాలిటీ మిస్ అవుతుందేమోనన్న భయం ఒకవైపు, నేటివిటీ ప్రాబ్లం మరోవైపు. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. ఆడియన్స్ ను కన్విన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే చిరూ ఈ స్క్రిప్ట్ కు బాగా పదును పెట్టిస్తున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చిరూ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నాడు.













