Samantha: ఒంటరితనం ఎంతో భయకరమైనది: సమంత
ఆ మధ్య అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత(Samantha), ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అమెజాన్ ప్రైమ్(Prime Video)కోసం చేసిన సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణే వచ్చింది. సినిమాలు చేసినా చేయకపోయినా సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదొక విషయాన్ని షేర్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది.
ఈ నేపథ్యంలో సమంత తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. ఈ రోజుల్లో ఫోన్ ను విడిచి క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అలాంటిది సమంత ఎవరితో సంబంధం లేకుండా, కనీసం ఫోన్ కూడా తన దగ్గర లేకుండా మూడు రోజులు గడిపిందట. మూడ్రోజుల పాటూ తాను సైలెంట్ గా ఉన్నానని, ఫోన్ లేదని, ఎవరితో కమ్యూనికేషన్ కూడా లేదని సమంత ఈ పోస్ట్ లో చెప్పింది.
అంతేకాదు, ఈ మూడు రోజులు తనతో తాను మాత్రమే ఉన్నానని, మనతో మనం ఒంటరిగా ఉండటం అన్నింటి కంటే ఎంతో కష్టమైందని, చాలా భయంకరమైనదని, కానీ అలా ఉండటాన్ని తానెంతో ప్, మీరు ప్రేమిస్తున్నానని, మీరు కూడా అలా ఉండటానికి ట్రై చేయమని తన ఫాలోవర్లకు సూచిస్తోంది సమంత.













