లోకేష్ కల తీరేనా?
బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల మార్కెట్ ఓపెన్ చేసింది మొదట తెలుగు సినిమానే. ఆ తర్వాత వెంటనే దంగల్, పఠాన్, జవాన్ సినిమాలు కూడా బాలీవుడ్ నుంచి ఆ ఫీట్ ను సాధించాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్2 కూడా 1000 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకుంది. కానీ తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ ఫీట్ ను అందుకోలేకపోయింది.
శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా తమ సినిమాలతో వందల కోట్లు కలెక్షన్లు సాధించారు కానీ వెయ్యి కోట్ల మార్క్ మాత్రం ఎవరూ అందుకోలేకపోయారు. రీసెంట్గా లియో సినిమాతో రూ.500 కోట్ల మార్క్ దాటిన లోకేష్ కనగరాజ్ తన తర్వాతి సినిమాతో ఎలాగైనా ఈ రూ.1000 కోట్ల మార్కెట్ అందుకోవాలని చూస్తున్నాడు.
లియో సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, త్వరలోనే ఆ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. లియోతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేసిన లోకేష్, ఈ సారి రజినీ సినిమాతో నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాలని చూస్తున్నాడు. మరి ఇదెంత వరకు సాధ్యపడుతుందన్నది చూడాలి.













