లోకేష్‌ను పొగిడి, శంకర్‌ను తగ్గించేస్తున్నారు
టాలీవుడ్ మార్కెట్లో పక్క భాషల డైరెక్టర్లు సత్తా చూపించడం, వారికంటూ స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం మనకేం కొత్త కాదు. మణిరత్నం, బాలచందర్, శంకర్ నుంచి వస్తున్నదే. కానీ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో లియో బుకింగ్స్ చూస్తుంటే శంకర్ తర్వాత ఆ రేంజ్ లోకేష్ కనగరాజ్ దే అని తెగ పొగిడేస్తున్నారు.
విజయ్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది అనే దాని వరకు ఓకే కానీ ఫస్ట్ డే నే అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యేంత రేంజ్ అయితే లేదు. దీనికి కారణం కచ్ఛితంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజే. కానీ తనను డైరెక్టర్ శంకర్ తో కంపేర్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. శంకర్ ఎప్పుడూ సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలనే సినిమాలు చేస్తుంటాడు.
ఫైట్స్, సాంగ్స్ అన్నీ ఉంటూనే సినిమాలో ఏదొక మెసేజ్‌ను పొందుపరుస్తాడు శంకర్. కానీ లోకేష్ అలా కాదు. తన సినిమాలన్నీ యాక్షన్ సినిమాలే. హీరోని ఎలా చూపిస్తే మాస్ ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారనే దాన్ని పట్టుకుని దానిపై సినిమా స్టోరీ రాసుకుంటాడు తప్పించి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేయడు. కేవలం లియో ఓపెనింగ్ కలెక్షన్స్ చూసి లోకేష్ ను శంకర్ తో పోల్చడమనేది కరెక్ట్ కాదు. కలెక్షన్స్ అనేవి ఎప్పుడూ డైరెక్టర్ టాలెంట్ కు పనికిరావు.













