ప్రభాస్ సినిమా గురించి లోకేష్ క్లారిటీ
విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న తాజా సినిమా లియో. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ తో లోకేష్ చేయబోయే సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అని డౌట్స్ రైజ్ చేస్తున్నారు.
ఈ విషయంపై లోకేష్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో తాను చేయబోయే సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగం కాదని తేల్చి చెప్పేశాడు. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నింటినీ LCU లో భాగంగానే తెరకెక్కించాడు. కానీ ప్రభాస్ సినిమా మత్రం ఓ డిఫరెంట్ ఒరిజినల్ స్టోరీ తో చేయనున్నట్లు చెప్పాడు.
కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ఎంత లేదన్నా మరో రెండేళ్లు పడుతుంది. దానికి కారణం వీరిద్దరూ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండటమే. లియో తర్వాత లోకేష్ రజినీకాంత్ తో ఓ సినిమా చేయాలి. ఇది కూడా స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ అని లోకేష్ చెప్పాడు. ఆ తర్వాత ఖైదీ2, విక్రమ్2 , రోలెక్స్ సినిమాలున్నాయి. వీటన్నింటి తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుంది అంటే ఈ కాంబో పట్టాలెక్కాలంటే 2026 వరకు ఆగాల్సిందే.













