Lokesh Kanagaraj: అజిత్ తో సినిమాపై లోకేష్ క్లారిటీ
సౌత్ ఇండియన్ డైరెక్టర్లలో తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్(lokesh Kanagaraj) కూడా ఒకరు. ప్రతీ సినిమాతో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటున్న లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ఖైదీ(Khaidhi), మాస్టర్(Master), విక్రమ్(Vikram), లియో(Leo) సినిమాలతో చాలా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా కూలీ(Coolie) సినిమా రాబోతుంది.
ఆగస్ట్ 14న కూలీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు లోకేష్. ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith) తో ఎప్పుడు సినిమా అనే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ చెప్పిన సమాధానం అందరినీ తెగ ఎగ్జైట్ చేస్తోంది. తనకు అజిత్ అంటే ఎంతో ఇష్టమని లోకేష్ చెప్పాడు.
తమ మధ్య సరైన టైమ్ వచ్చినప్పుడు సినిమా కచ్ఛితంగా ఉంటుందని లోకేష్ కన్ఫర్మ్ చేయడంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే లోకేష్.. కమల్, రజినీతో వర్క్ చేయడంతో అజిత్ తో ఎప్పుడు చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో లోకేష్ ఈ క్లారిటీ ఇవ్వడంతో తమిళ సినీ ప్రియులు ఎంతో సంతోషిస్తున్నారు. లోకేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.







