లియో ఫ్లాష్ బ్యాక్ అబద్దమా?
ఈ వారంలో దసరా కానుకగా రిలీజైన లియో సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సినిమా గురించి ఎంతో ఊహించుకుని వెళ్లిన ఆడియన్స్ కు లియో నిరాశనే మిగిల్చింది. పార్తిబన్ స్టోరీని ఎంతో సాదాసీదాగా నడిపించిన లోకేష్, ఫ్లాష్ బ్యాక్ లోని లియో దాస్ క్యారెక్టర్ తో కిక్ ఇస్తాడనుకుంటే అది కూడా చేయలేకపోయాడు.
దీంతో లియో క్యారెక్టర్ కు ముందిచ్చిన బిల్డప్ కు తగ్గట్లు ఫ్లాష్ బ్యాక్ లేకపోవడం, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా నరబలి నేపథ్యంలో కొనసాగడంతో లియో క్యారెక్టర్ కు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఇప్పుడు నెట్టింట ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
లియో సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస ఓ ఇంటర్వ్యూలో లియో ఫ్లాష్ బ్యాక్ నిజమనుకోవడానికి లేదన్నట్లు మాట్లాడాడు. అంటే లియో ఫ్లాష్ బ్యాక్ గురించి మన్సూర్ అలీ ఖాన్ గౌతమ్ మీనన్ కు చెప్పినదంతా కట్టు కథ అయ్యుండొచ్చనేది ఆయన మాటలకు అర్థంగా అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనం సినిమాలో చూసినది మొత్తం అబద్ధం. దీనికి సీక్వెల్ గా విజయ్ తో తీసే సినిమాలో లియో గురించి మొత్తం వివరిస్తారంటున్నారు. అదే నిజమైతే మరి ఈ సినిమా ఎందుకు తీసినట్లు? ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించి పిచ్చోళ్లను చేయడానికా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.













