Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
అందానికి అందం, కష్టపడే తత్వం, టాలెంట్ ఎన్ని ఉన్నా అక్కినేని హీరో అఖిల్(Akkineni akhil) కు సక్సెస్ అనేది మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇప్పటివరకు అఖిల్ పలు సినిమాలు చేసినా వాటిలో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అయిన దాఖలాలు లేవు. ఏజెంట్(Agent) సినిమా అఖిల్ కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందనుకుంటే ఆ సినిమా వల్ల అఖిల్ కనీసం మీడియా ముందుకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఎంతో గ్యాప్ తీసుకున్న అఖిల్ తన తర్వాతి సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి(Murali kishore abburi) దర్శకత్వంలో చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను అఖిల్ ఇప్పటికే ఫినిష్ చేశాడని, కానీ మళ్లీ ప్యాచ్ వర్క్ ఉండటంతో అఖిల్ వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఫ్యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బావుంటాయని అంటున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని అఖిల్ లెనిన్(Lenin) పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయినా అఖిల్ కు కోరుకున్న సక్సెస్ ను అందిస్తుదో లేదో చూడాలి.






